Vidyaranya Kamlekar: సీనియర్ పాత్రికేయుడు, సౌమ్యుడు, జాతీయవాది విద్యారణ్య కామ్లేకర్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కామ్లేకర్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. కామ్లేకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విద్యారణ్య కామ్లేకర్ ప్రస్తుతం సకాల్ మరాఠీ పత్రికకు తెలుగు రాష్ట్రాల ఇంఛార్జిగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త, చరిత్రకారుడు పండిత హీరాలాల్ కుమారుడే సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్. స్నేహశీలి, మృదుబాషి, మంచి రచయిత అయిన విద్యారణ్య గారు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ బాషా పత్రికల్లో పని చేసి మంచి జర్నలిస్ట్‌గా పేరొందారు. ఆయన మృతి జర్నలిజం లోకానికి ఓ పెద్ద లోటని పలువురు సీనియర్ పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
సీనియర్ పాత్రికేయుడు, సౌమ్యుడు, జాతీయవాది శ్రీ విద్యారణ్య కామ్లేకర్ గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి విచారించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/UeTlYSRiIC
— Vice President of India (@VPSecretariat) March 16, 2022
Read Also… Holi 2022: రేపు హోలికా దహనం.. శుభ సమయం, పూజా విధానం.. కలిగే ఫలితాలు పూర్తి వివరాలు