Gandhi Hospital: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని మూడో అంతస్తులో గల యూరాలజీ ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల సామాగ్రి అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. అయితే, అగ్ని ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఈ మంటలు ఎలా అంటుకున్నాయనేది మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించొచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
Also read:
INd Vs AUS Test Match: ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మ్యాచ్‌కు అంతరాయంగా మారిన వర్షం..