Hyderabad: సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీ రిపోర్టులో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. సరూర్‌నగర్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు పోలీసులు. ఇద్దరు నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ సేకరించిన పోలీసులు.. ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులతో తప్ప నిందితులు ఎవ్వరితోనూ మాట్లాడలేదని నిర్ధారించుకున్నారు. మసూద్ తన ఈమెయిల్ లాగిన్‌కు ఐడీ, పాస్‌వర్డ్‌గా తన మొబైల్ నెంబర్‌ను పెట్టుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అదే ట్రిక్‌ను నాగరాజు మెయిల్‌ను హ్యాక్ చేసేందుకు మసూద్ ప్రయోగించాడని పోలీసులు తెలిపారు. అయితే, జీమెయిల్ ద్వారా ఫైండ్ మై డివైజ్ లోకి వెళ్లి నాగరాజు లొకేషన్‌ను కొనుగొన్నారు నిందితులు. ఇద్దరు నిందితులకు ఎటువంటి సంఘ వ్యతిరేక సంస్థలతో సంబంధాలే లేవని పోలీసులు స్పష్టం చేశఆరు. కొన్ని ముస్లిం సంస్థలతో వారికి సంబంధాలు ఉన్నాయని రాజకీయ నేతలు చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. వివరాల వెల్లడి అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.