60 రోజుల పటిష్ట ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కృషిః ఎర్రబెల్లి

|

Aug 16, 2019 | 2:02 PM

అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ప్రత్యేకించి గ్రామాల అభివృద్ధికి 60 రోజుల ప్రణాళికను రూపొందించామని చెప్పారు. కాజీపేట మడికొండ పెద్ద చెరువులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మత్స్యకారుల బ్రతుకుల్లో వెలుగులు తెచ్చారన్నారు. ఉచితంగా చేప పిల్లలతో పాటు, సబ్సిడీతో వాహనాలు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌దే […]

60 రోజుల పటిష్ట ప్రణాళికతో గ్రామాభివృద్ధికి కృషిః ఎర్రబెల్లి
Follow us on

అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ప్రత్యేకించి గ్రామాల అభివృద్ధికి 60 రోజుల ప్రణాళికను రూపొందించామని చెప్పారు. కాజీపేట మడికొండ పెద్ద చెరువులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మత్స్యకారుల బ్రతుకుల్లో వెలుగులు తెచ్చారన్నారు. ఉచితంగా చేప పిల్లలతో పాటు, సబ్సిడీతో వాహనాలు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌దే అన్నారు. ప్రతీ కుటుంబానికి గేదెలు ఇప్పించాలని యోచిస్తున్నట్టుగా చెప్పారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని మల్కాపూర్‌ రిజర్వాయర్‌ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే దేవాదుల పనులు నత్తనడకన సాగాయన్నారు. వచ్చే నాలుగు నెల్లలో దేవాదుల నుండి 365 రోజుల పాటు నీటిని ఎత్తిపోస్తామన్నారు. దేవాదుల నీటితో ఉమ్మడి వరంగల్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేష్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు.