Telangana: పేదల పిల్లలకు పెద్ద చదువులు.. విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల రూపాయలు. పేదల పిల్లలకు పెద్ద మనసుతో రేవంత్ సర్కార్ అందిస్తున్న సాయం. దేశంలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో...యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను పెద్దఎత్తున నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. పేదల పిల్లలకు అతి భారీ స్థాయిలో రేవంత్ సర్కార్ చదివింపులు ఇవి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల విషయంలో కీలక ముందడుగు పడింది. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ. 11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది.
ఒక్కో గురుకుల పాఠశాలకు రూ. 200 కోట్లు చొప్పున పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇలాంటి స్కూల్స్ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో స్కూళ్లను నిర్మిస్తామని, టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేశామన్నారు భట్టి. ప్రైవేట్ స్కూళ్లలో చదవలేని పిల్లలకు..కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పశువుల పాకల్లో పాఠశాలలు ఏర్పాటు చేసిందని విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) కాంప్లెక్స్‌లు నిర్మించబడే నియోజకవర్గాల జాబితా దిగువన చూడండి: