Hyderabad: వామ్మో.. మహాతల్లి చేసిన పనికి అధికారులే షాక్.. ఏకంగా కిలో బంగారాన్ని ఎక్కడ పెట్టిందంటే..

| Edited By: Shiva Prajapati

Jul 19, 2023 | 1:11 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తరచూ భారీగా బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు గట్టి నిఘా పెడుతున్నారు.. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. స్మగ్లర్లు ఎయిర్‌పోర్టులో ఉండే కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Hyderabad: వామ్మో.. మహాతల్లి చేసిన పనికి అధికారులే షాక్.. ఏకంగా కిలో బంగారాన్ని ఎక్కడ పెట్టిందంటే..
Gold Smuggling
Follow us on

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తరచూ భారీగా బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు గట్టి నిఘా పెడుతున్నారు.. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. స్మగ్లర్లు ఎయిర్‌పోర్టులో ఉండే కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరకు అధికారులకు అడ్డంగా బుక్కైపోతున్నారు..l

బంగారం అక్రమ తరలింపునకు శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది.. విదేశాల నుండి నగరానికి బంగారం తీసుకు రావడానికి స్మగ్లర్లు కొత్త దారులు అన్వేషిస్తున్నారు.. ఒక దారి మూసుకుపోతే మరో దారిలో బంగారం తరలిస్తున్నారు.. అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుతూ యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. పేస్ట్ రూపంలో, చాక్లెట్ల మాదిరిగా, బిస్కెట్లు లాగా.. ఇలా రకరకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అనేక మార్గాల్లో విదేశాల నుండి హైదరాబాద్‌కు పుత్తడిని తీసుకు వస్తూ ఉండటంతో విమానాశ్రయ అధికారులు కూడా గట్టి నిఘా ఉంచుతున్నారు.

గత కొద్ది రోజుల క్రితం రియాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అధికారులు పట్టుకున్నారు. ఈ ముగ్గురు తాము ధరించిన సాక్సుల్లో పేస్టు రూపంలో బంగారాన్ని పెట్టి తీసుకొచ్చారు. పట్టుబడిన బంగారం 1818.98 గ్రాములు ఉంటుందనీ కస్టమ్స్ అధికారులు తెలిపారు.ఈ ఘటన మరువక ముందే దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారాన్ని పట్టుకున్నారు. ఆ ప్రయాణికులు తెచ్చుకున్న బ్యాగులను తనిఖీ చేయగా.. అందులో చాక్లెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ చాక్లెట్లు భిన్నంగా ఉండటంతో వాటిని పరిశీలించగా అవి బంగారు చాక్లెట్లగా తేలింది. ఈ బంగారు చాక్లెట్లు సుమారు 269 గ్రాములు ఉంటుదని, పట్టుబడ్డ బంగారం విలువ రూ.16.5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు జడ్డా నుండి హైదరాబాద్ కు వచ్చిన మరో ప్రయాణికుడి నుండి రూ. 15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్టు రూపంలోని బంగారాన్ని బూట్లలో దాచి తీసుకువచ్చాడు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా అడ్డంగా దొరికిపోయాడు. ఇదే కాకుండా ఓ మహిళ దుబాయ్‌ నుంచి వస్తూ వస్తూ లో దుస్తుల్లో బంగారాన్ని తీసుకు వచ్చింది. మహిళ ప్రయాణీకురాలు లోదుస్తుల్లో బంగారాన్ని పేస్టుగా మార్చి తీసుకువచ్చింది. రూ. 86 లక్షల విలువ చేసే 1,614 గ్రాముల బంగారాన్ని ఆమె లోదుస్తుల్లో తీసుకు వచ్చింది.

నిత్యం అనేక మార్గాల్లో బంగారం నగరంలోకి అక్రమంగా తీసుకురావాలని కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా తీరు మారడం లేదు.. కస్టమ్స్ అధికారుల హెచ్చరికలు ఉన్న భయం లేకుండా స్మగ్లర్లు దందా సాగిస్తునే ఉన్నారు. చర్యలు ఉంటున్నప్పటికీ బంగారం అక్రమ రవాణా తగ్గకపోవడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు మరింత పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..