దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇక సాయంత్రం సమయంలో పలు చోట్ల రావణ దహనం నిర్వహించారు. అయితే ఈ రావణ దహనంలో అపశృతి చోటు చేసుకుంది. రావణుడి బొమ్మలో పెట్టిన టపాసులు పేలి జనాలమీదకు వచ్చేశాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ లో జరిగింది. రావణ దహనం చేస్తుండగా ఒక్కసారిగా జనాల మీదకు టపాసులు దూసుకువచ్చాయి. దాంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదాంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పిందంటూ జనాలు ఊపిరిపీల్చుకున్నారు. ఒక్కసారి ఊహించని విధంగా టపాసులు దూసుకురావడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :