AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

May Flower: కరోనా వైరస్‌లా కనిపించే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

భూగోళంపై జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అలాగే ఏడాదిలో కేవలం ఒకే సారి పూసే అరుదైన మొక్క ఒకటి ఉంది. ఆ మొక్క పుష్పాలు కేవలం మే నెలలోనే వికసించి అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ ఏడాది పూసిన ఆమొక్క ప్రస్తుతం అందిరిని ఆకట్టుకుంటోంది. అది ఎక్కడో చూద్దాం పదండి.

May Flower: కరోనా వైరస్‌లా కనిపించే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
Rare Football Lily Blooms In Kosgi
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: May 05, 2026 | 7:34 PM

Share

నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన వార్ల మల్లేశం అనే ఉపాధ్యాయుడి టెర్రస్ గార్డెన్‌లో ఓ అరుదైన దృశ్యం దర్శనమిచ్చింది. సంవత్సరంలో కేవలం మే మాసంలో ఒక్కసారి మాత్రమే పూసే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ పుట్బాల్ లిల్లీ అనే పుష్పం వికసించింది. ఈ మొక్క వృక్షరాజ్యంలోని అమరిల్లిడేసి కుటుంబానికి చెందిది. ఈ దుంపకాండ మొక్క శాస్త్రీయ నామం స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ కాగా.. భారత దేశంలో ఈ మొక్కను పుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అనే పేర్లతో పిలుస్తుంటారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఈ మొక్క ఉనికి మన దేశంలో కొనసాగుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు నుండి ఆసక్తితో పదేళ్ల క్రితం ఈ మొక్క దుంపను తెచ్చికున్న మల్లేశం దాన్ని జాగ్రత్తగా కుండీలో నాటి పెంచుతున్నారు. ప్రతి ఏటా మే నెలలో మాత్రమే ఈ మొక్కకు పుష్పాలు పూస్తాయని తెలిపారు. అయితే ప్రతి ఏటా ఈ మొక్కకు ఓకే పుష్పం పూసేదని.. కానీ గత ఏడాది మాత్రం నాలుగు పుష్పాలు పూయగా.. ఇప్పుడు ఒకటి పెరిగి ఐదు పూశామని సంతోషం వ్యక్తం చేశారు.

జూన్ నెల వరకు ఈ పుష్పాలు ఉంటాయని.. ఆ తరువాత అవి రాలి పోతాయని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆకులు జనవరి వరకు మాత్రమే ఉండి ఎండిపోతాయంటున్నారు. కేవలం దుంప మాత్రమే మట్టిలో దాగి ఉండి మే నెలలో మొగ్గలు తోడిగి పువ్వులు వస్తాయని, అందుకే దీనిని మే పుష్పం అని పిలుస్తారని మల్లేశం చెప్పారు. ఈ దుంపను ఒక్కసారి నేలలో పాతితే ఈ మొక్కకు మరణమే ఉండదని ఆయన చెబుతున్నారు.

ఇక మల్లేశం ఇంట్లో ఫుట్ బాల్ లిల్లీ వికసించిన సమాచారం తెలుసుకొని కోస్గి పట్టణ వాసులు మే పుష్పాన్ని చూసేందుకు క్యూ కట్టారు. అరుదైన పుష్పాన్ని చూసి అందరూ ముచ్చటపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కడుపు నొప్పని వెళ్తే.. చూసి డాక్టర్లకే పిచ్చెక్కిపోయింది!
కడుపు నొప్పని వెళ్తే.. చూసి డాక్టర్లకే పిచ్చెక్కిపోయింది!
ఆకాశంలో పొగలు కమ్మిన ఇండిగో విమానం..!
ఆకాశంలో పొగలు కమ్మిన ఇండిగో విమానం..!
కరోనా వైరస్‌లా కనిపించే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
కరోనా వైరస్‌లా కనిపించే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
ఒక నెలపాటు టీ తాగడం మానేస్తే మన శరీరంలో ఏం జరుగుతుంది?
ఒక నెలపాటు టీ తాగడం మానేస్తే మన శరీరంలో ఏం జరుగుతుంది?
టాలీవుడ్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం
టాలీవుడ్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం
టీ తాగుతూ సిగరెట్ పిలుస్తున్నారా?ఈ వ్యాధులు మీకోసం క్యూలో ఉన్నాయ్
టీ తాగుతూ సిగరెట్ పిలుస్తున్నారా?ఈ వ్యాధులు మీకోసం క్యూలో ఉన్నాయ్
డయాబెటిస్ రోగులకు చికెన్ మంచిదా? మటనా?
డయాబెటిస్ రోగులకు చికెన్ మంచిదా? మటనా?
లుంగీ ఎన్గిడి ఎంట్రీ.. స్టార్ బ్యాటర్ ఔట్.. అక్షర్ సంచలన నిర్ణయం
లుంగీ ఎన్గిడి ఎంట్రీ.. స్టార్ బ్యాటర్ ఔట్.. అక్షర్ సంచలన నిర్ణయం
ఎండల వేడి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు బెటరా, చెరుకు రసమా?
ఎండల వేడి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు బెటరా, చెరుకు రసమా?
ఇంటిపై వాటర్ ట్యాంకులో నాచు, చెత్త పేరుకుపోయిందా? ఈ సహజ చిట్కా
ఇంటిపై వాటర్ ట్యాంకులో నాచు, చెత్త పేరుకుపోయిందా? ఈ సహజ చిట్కా