Telanagana: పెండిగ్ బిల్లులపై వివరణ ఇచ్చిన రాజ్ భవన్.. ఇప్పటికే మూడు బిల్లులు ఆమోదించామని స్పష్టం

రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల అంశపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై విమర్శలు చేసింది.

Telanagana: పెండిగ్ బిల్లులపై వివరణ ఇచ్చిన రాజ్ భవన్.. ఇప్పటికే మూడు బిల్లులు ఆమోదించామని స్పష్టం
Governor Tamilisai

Updated on: Jul 10, 2023 | 5:46 PM

రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల అంశపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై విమర్శలు చేసింది. అలాగే ఇందుకు సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టులో కూడా వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకే గవర్నర్ బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

అయితే తాజాగా పెండింగ్ బిల్లుల అంశానికి సంబంధించి రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వద్ద ఎటువంటి బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లో లేవని తెలిపింది. గతంలోనే ఈ 3 బిల్లులను గవర్నర్ ఆమోదించారని స్పష్టం చేసింది. అలాగే మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలను పంపారని తెలిపింది. మిగిలి ఉన్న బిల్లలపై కూడా వివరణ కోరుతూ రాష్ట్ర సర్కార్‌కు తిరిగి పంపామని వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..