Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్న రూ.25 కోట్ల పంచాయితీ.. రేవంత్‌రెడ్డి ప్రమాణం!

|

Apr 22, 2023 | 9:05 PM

పాతిక కోట్ల మ్యాటర్‌ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపింది. కాంగ్రెస్‌ అండ్ బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ఈటల చేసిన కామెంట్స్‌ రచ్చ సృష్టించాయ్‌. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్‌ సీన్‌ హీటెక్కిపోయింది. దమ్ముంటే భాగ్యలక్ష్మి టెంపుల్‌కి రా!..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్న రూ.25 కోట్ల పంచాయితీ.. రేవంత్‌రెడ్డి ప్రమాణం!
Bhagyalakshmi Temple
Follow us on

పాతిక కోట్ల మ్యాటర్‌ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపింది. కాంగ్రెస్‌ అండ్ బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ఈటల చేసిన కామెంట్స్‌ రచ్చ సృష్టించాయ్‌. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్‌ సీన్‌ హీటెక్కిపోయింది. దమ్ముంటే భాగ్యలక్ష్మి టెంపుల్‌కి రా!. కేసీఆర్‌ నుంచి డబ్బు తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తా!. నువ్వు చెప్పింది నిజమైతే వచ్చి ప్రమాణం చెయ్‌!. ఈటల టార్గెట్‌గా రేవంత్‌ వదిలిన ఈ సవాల్‌తో రోజంతా భారీ హైడ్రామా నడిచింది. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్‌ వార్నింగ్‌ ఇస్తే, అంతే దీటుగా కౌంటర్‌ ఇచ్చారు ఈటల. ఇంతకీ, రేవంత్‌ ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి? ఈటల కౌంటర్‌ ఏంటి?

ఈటల చేసిన ఈ కామెంట్సే తెలంగాణ పాలిటిక్స్‌లో ఒక్కసారిగా మంటలు పుట్టించాయ్‌. రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌ లీడర్స్‌ అంతా ఈటలపై భగ్గుమన్నారు. నీ మాటల్లో నిజంగానే నిజముంటే రా.. భాగ్మలక్ష్మి టెంపుల్‌లో ప్రమాణం చేద్దాం అంటూ రేవంత్‌ సవాల్‌ విసరడంతో పొలిటికల్‌ హీట్ సర్రున లేచింది.

దమ్ముంటే రా!. కేసీఆర్‌ నుంచి డబ్బు తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తా!. నువ్వు చెప్పింది నిజమైతే ప్రమాణం చెయ్‌!. ఇదీ, బీజేపీ ఎమ్మెల్యే ఈటల టార్గెట్‌గా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వదిలిన సవాల్‌.

ఇవి కూడా చదవండి

రేవంత్‌ అంత మాటంటే బీజేపీ ఊరుకుంటుందా!. ఈటల తరపున సీన్‌లోకి దిగిన కాషాయ నేతలు ప్రతి సవాల్‌ విసిరారు!. ముందు, ఓటుకు నోటు కథ చెప్పు!. దానిపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ రివర్స్‌లో కౌంటర్ ఇచ్చారు.

అయితే, చెప్పినట్టే భాగ్యలక్ష్మి టెంపుల్‌కి వచ్చిన రేవంత్‌.. ఈటలపై ఒక రేంజ్‌లో చెలరేగిపోయారు. కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే అమ్ముడుపోయామ్‌ అంటావా!. ఖబడ్దార్‌ రాజేందర్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. మొత్తానికి పాతిక కోట్ల క్యాష్‌ ఇష్యూ ఒక్కసారిగా తెలంగాణలో కాకపుట్టించింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజంతా హీట్‌ పెంచింది. చెప్పినట్టే భాగ్యలక్ష్మి టెంపుల్‌కొచ్చి రేవంత్‌రెడ్డి ప్రమాణం చేస్తే, ఈటల మాత్రం లైట్‌ తీస్కున్నారు. మరి, ఇది ఇంతటితోనే ఆగుతుందా? లేక మరిన్ని ప్రకంపనలు రేపుతుందా? అనేది చూడాలి.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి