New Year Celebrations: దొరికితే ఇక అంతే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో గట్టి నిఘా.. వాటిపై స్పెషల్‌ ఫోకస్‌

New Year Celebrations 2024: న్యూ ఇయర్‌ వేడుకలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు ఏపీ, తెలంగాణ పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ముఖ్యంగా.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్‌ పోలీసులు సిటీపై డేగకన్ను వేశారు. నిన్న రాత్రి నుంచే పబ్‌లలో తనిఖీలు షురూ చేశారు. డ్రగ్స్‌ వినియోగదారులు తప్పించుకోలేని విధంగా సరికొత్త టెస్టులకు సిద్ధమవుతున్నారు సిటీ పోలీసులు.

New Year Celebrations: దొరికితే ఇక అంతే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో గట్టి నిఘా.. వాటిపై స్పెషల్‌ ఫోకస్‌
New Year Celebrations

Updated on: Dec 31, 2023 | 6:40 AM

New Year Celebrations 2024: న్యూ ఇయర్‌ వేడుకలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు ఏపీ, తెలంగాణ పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ముఖ్యంగా.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్‌ పోలీసులు సిటీపై డేగకన్ను వేశారు. నిన్న రాత్రి నుంచే పబ్‌లలో తనిఖీలు షురూ చేశారు. డ్రగ్స్‌ వినియోగదారులు తప్పించుకోలేని విధంగా సరికొత్త టెస్టులకు సిద్ధమవుతున్నారు సిటీ పోలీసులు. విశాఖ, విజయవాడలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కట్టుదిట్టంగా నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు ఏపీ పోలీసులు.

న్యూ ఇయర్ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పేందుకు హైదరాబాద్‌ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అటు.. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ప్రత్యేకించి యూత్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. అయితే.. గతానికి భిన్నంగా ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పబ్బులు, క్లబ్బులు, బార్‌లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు హైదరాబాద్‌ పోలీసులు. ఇప్పటికే నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించారు పోలీసులు. అందులోనూ.. డ్రగ్స్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఈ సారి సరికొత్త పరీక్షలు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు.

డ్రగ్స్‌ వినియోగించినవారిని గుర్తించేందుకు డ్రగ్ డిటెక్టర్లు

ఈసారి.. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించినవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను టీఎస్ న్యాబ్‎ రెడీ చేసింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ‘డ్రాగ్గర్’, ‘అబొట్’ అనే పరికరాలతో స్పాట్‎లోనే డ్రగ్స్ వినియోగించారా లేదా? అనే విషయాన్ని తేల్చేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు 25 చొప్పున ఈ రెండు అత్యాధునిక పరికాలను అందజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా.. పబ్, రిసార్ట్, చౌరస్తాల దగ్గర తనిఖీలు చేసి డ్రగ్స్‌ వినియోగదారులను పసిగట్టనున్నారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే హైదరాబాద్‌లోని పలు పబ్స్‌‌లో తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలి, మాదాపూర్‌లో నార్కోటిక్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ నిర్మూలించాలంటూ యూత్ ఆధ్వర్యంలోనూ పబ్బులలో అవగాహన కల్పించడంతోపాటు వాల్ పోస్టర్ల ప్రదర్శించారు.

న్యూ ఇయర్‌ నేపథ్యంలో డ్రగ్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తున్నామన్నారు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి. పబ్‌ల దగ్గర సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి.. డ్రగ్స్‌ డిటెక్టర్‌ కిట్‌లతో తనిఖీలు చేస్తామని చెప్పారు. ఇక.. డ్రగ్స్‌ తీసుకున్నవాళ్లేవరూ పోలీసుల నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు సీపీ శ్రీనివాస్‌రెడ్డి.

MG రోడ్‌, బందర్ రోడ్ ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడలోనూ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించారు పోలీసులు. సిటీలోని Mg రోడ్‌, బందర్ రోడ్ ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలతోపాటు రోడ్లపై రచ్చ చేస్తే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు సీపీ కాంతి రాణా టాటా. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కట్టుదిట్టంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇక.. విశాఖలోనూ అల్లూరి జిల్లా అరకు ట్రైబల్ మ్యూజియంలో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి కూడా పర్యాటకులను అనుమతించనున్నారు. మొత్తంగా.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీ చర్యలతో.. న్యూ ఇయర్ వేడుకల్లో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..