PM Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో

PM Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..
Pm Modi

Updated on: Jan 21, 2023 | 12:09 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, ఈనెల 19వ తేదీనే ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. జనవరి 19న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్ ప్రారంభం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాలను రద్దు చేసి షెడ్యూల్ మార్చారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్‌ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పుడు ఫిబ్రవరి 13న ఆయన తెలంగాణలో పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పీఎంవో ప్రకటించింది.

తెలంగాణపై ఫోకస్..

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద నేతలంతా వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారు కాగా, ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో పర్యటించేలా, సభలు, సమావేశాలతో ప్లాన్స్ రెడీ చేసుకుంది బీజేపీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us