కోవిడ్ నేపథ్యంలో ప్రధానికి స్వాగత ఏర్పాట్లపై ఆంక్షలు, ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి

|

Nov 28, 2020 | 11:37 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గతంలో అనుసరించిన సంప్రదాయాలకు ఈ సారి తిలోదకాలు ఇచ్చారు.

కోవిడ్ నేపథ్యంలో ప్రధానికి స్వాగత ఏర్పాట్లపై ఆంక్షలు, ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి
Follow us on

ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారయ్యింది. షెడ్యూల్‌పై మొదటి నుంచి మార్పులు చేర్పులు చేస్తునే ఉన్నారు. ఫైనల్‌గా నేడు అహ్మదాబాద్, హైదరాబాద్‌, పుణెలలో ప్రధాని పర్యటిస్తున్నట్లు సమాచారం అందింది. మార్పులు చేర్పులు అనంతరం ప్రధాని హైదరాబాద్ పర్యటనకు చివరకు ఓ టైం ఫిక్స్‌ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పీఎం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారత్‌ బయో టెక్‌ కు వెళ్లి అక్కడ వ్యాక్సిన్‌ తయారీని పరిశీలిస్తారు. భారత్‌ దేశీయంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టడం కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరోవైపు  ప్రధాని పర్యటన సందర్భంగా పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ఆదేశాలు అందాయి. హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతిస్తున్నట్టు పీఎంవో స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌… సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. ఈ ఆదేశాలతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్‌ మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం ప్రధాని పర్యటిస్తోన్న అన్ని రాష్ట్రాలలో కూడా సీఎంలు హాజరు కావడం లేదు. కేవలం అధికారులు మాత్రమే ఆయనకు స్వాగతం చెబుతున్నారు.  వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్ప‌త్తి చేస్తున్న సంస్థ‌ల‌ను ప్రధాని ఒక్కరే సందర్శించి శాస్త్రవేత్తల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పీఎంఓ పర్యటనలు ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం.