తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వేగం పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ అగ్ర నేతలతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దశలవారీగా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.. ఇప్పుడు మళ్లీ ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా.. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.
ఈనెల 7, 11,19 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 7న తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు. అలాగే.. 11న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్యఅతిథిగా రాబోతున్నారు ప్రధాని మోదీ.
ఇక.. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు మోదీ తెలంగాణకు రానుండటంతో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. గత పర్యటన సందర్భంగా.. తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసి వెళ్లిన మోదీ.. ఈసారి కూడా అదే పంథా కొనసాగిస్తారా..? లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి