వాహనదారులూ బీ అలర్ట్.. కాస్త ఏమరపాటుగా ఉన్నా మీ బండి పని అయిపోయినట్లే.. హైదరాబాద్‌లో పెట్రోల్ కల్తీ కలకలం..

|

Mar 10, 2021 | 4:02 PM

Petrol Adulteration: ఇప్పటికే క్రమం తప్పకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో జనాలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు కల్తీ..

వాహనదారులూ బీ అలర్ట్.. కాస్త ఏమరపాటుగా ఉన్నా మీ బండి పని అయిపోయినట్లే.. హైదరాబాద్‌లో పెట్రోల్ కల్తీ కలకలం..
Follow us on

Petrol Adulteration: ఇప్పటికే క్రమం తప్పకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో జనాలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు కల్తీ రాయుళ్ల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 100కు చేరువ అవడంతో ఎలారా దేవుడా అని తలబాదుకుంటుంటే.. పెట్రోల్ బంకుల్లో మోసాలు జనాన్ని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్‌లో కల్తీ పెట్రోల్ కలకం రేగింది. ఉప్పర్ పల్లిలోని బడేమియా పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కి బందులుగా నీళ్లు పోస్తున్నారు నిర్వాహకులు. ఈ విషయాన్ని గుర్తించిన వాహనదారులు.. పెట్రోల్ బంక్ నిర్వాహకులను నిలదీశారు. ఇదేం నిర్వాకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లతో కలిసిన పెట్రోల్ పోయడంతో తమ వాహనాలు పాడైపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్తీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. బడేమియా పెట్రోల్ పంప్ యజమానిపై పోలీసులు, సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని పెట్రోల్‌ను పరిశీలించారు. పెట్రోల్‌లో నిళ్లు కలపడాన్ని నిర్ధారించుకున్నారు. బంక్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ నిర్వాహకులు కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలాఉంటే.. ఇటీవలి కాలంలో వరుసగా పెట్రోల్ కల్తీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల క్రితం నిర్మల్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఓ వాహనదారుడు తన కారు ట్యాంక్ ఫుల్ చేయించుకోగా.. బంక్ నిర్వాహకుల మోసం బయటపడింది. కారు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ కెపాసిటీ 50 లీటర్లు అయితే, బంక్ నిర్వాహకులు మాత్రం 59 లీటర్ల పెట్రోల్ కొట్టారు. దాంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. దీనిపై బంక్ నిర్వాహకులను వాహనదారుడు నిలదీసి.. అధికారులకు ఫిర్యాదు చేశారు.

Also read:

Maruti Suzuki: గొప్ప అవకాశం.. లక్షా అరవై వేలకే మారుతి ఆల్టో కారు.. ఆఫర్ వివరాలు తెలుసుకోండిలా..

Google Maps: గూగుల్ మ్యాప్‌తో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..