తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశృతి

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో కరెంట్‌ షాక్‌తో ఓకరు చనిపోగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశృతి

Updated on: Jun 02, 2020 | 1:21 PM

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో కరెంట్‌ షాక్‌తో ఓకరు చనిపోగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దౌల్తాబాద్‌ మండలం దొమ్మట గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ భర్త అశోక్ విద్యుత్ షాక్‌తో స్పాట్‌లోనే చనిపోయాడు. అంగన్ వాడి ఆయా కలవ్వకు తీవ్ర గాయాలు. మెరుగైన చికిత్స కోసం ఆయాను హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనను తెలుసుకున్న మంత్రి హరీష్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటామని.. ప్రభుత్వ పరంగా 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. గాయపడ్డ బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు.

Loading...
Unable to load recommendations.
Follow Us