
ఏకంగా గ్రామ సర్పంచ్‌పైనే ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రూప్ సింగ్ తాండా సర్పంచ్‌గా ఉన్న రమణి భాయ్ భర్త భర్త హన్మంత్ నాయక్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన మొదటి భార్య నాతిభాయ్‌కు ఇద్దరు కుమారు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు వివాహమవ్వగా చిన్న కుమారుడు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. అయితే ఇటీవలే ఆయన మొదటి భార్య నాతిభాయ్ కూడా మరణించింది.ప్రస్తుతం చిన్న కుమారుడు అనార్ సింగ్ మాత్రమే ఉన్నాడు.
అయితే మరణించిన నాతిభాయ్ పేరిట 5 లక్షల రైతుభీమా మంజూరు అయింది. ఈ విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు అనార్ సింగ్ రైతు భీమా, ఆస్తి కోసం తండ్రితో గొడవ పడడం స్టార్ చేశాడు. అయితే హన్మంత్ నాయక్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న అనార్ సింగ్ పథకం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ కు తాళం వేసి పైకప్పుకు ఉండే రంధ్రం నుండి పెట్రోల్ పోసి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి ఆయన రెండో భార్య వాళ్ల పిల్లలపై నిప్పంటించాడు.
దీంతో పడుకున్న చోటే సర్పంచ్ రమణి భాయ్, భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేష్ లకు నిప్పంటుకొని తీవ్ర గాయాలు అయ్యాయి. మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలు అయ్యాయి. సర్పంచ్ నివాసంలో మంటలు చెలరేగడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకన్న పైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పి బాధితులను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కలహాలు,ఆస్తి తగాదాలే దాకిడి కారణంగా నిర్దారించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.