Telangana: తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాలే ఆ పాప ప్రాణం తీసింది.. ఆడుకుంటుండగా చిన్నారి మెడకు చుట్టుకుని..

గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్‌ దంపతులకు ఏడాది వయసు గల చిన్నారి ఉంది. అయితే.. పాప ఆడుకుంటుందని తల్లిదండ్రులు ఇంట్లో ఉయ్యాల ఏర్పాటు చేశారు.

Telangana: తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాలే ఆ పాప ప్రాణం తీసింది.. ఆడుకుంటుండగా చిన్నారి మెడకు చుట్టుకుని..
child girl

Updated on: Aug 30, 2022 | 3:50 PM

Rajanna Sircilla district: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు ఉయ్యాలలో ఆడుకుంటున్న చిన్నారి.. అకస్మాత్తుగా విగతజీవిగా మారింది. ఉయ్యాల తాడే ఆ చిన్నారి పాలిట ఉరితాడుగా మారింది. పాప ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల.. తీరని వేదనలో మునిగేలా చేసింది. ఈ విషాదకర సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్‌ దంపతులకు ఏడాది వయసు గల చిన్నారి ఉంది. అయితే.. పాప ఆడుకుంటుందని తల్లిదండ్రులు ఇంట్లో ఉయ్యాల ఏర్పాటు చేశారు. రోజూలానే చిన్నారి ఉయ్యాలలో ఆడుకుంటోంది.

ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఉయ్యాలలో ఆడుకుంటుండగా.. పాప మెడకు బిగుసుపోవడంతో చిన్నారి ఊపిరాడక మరణించింది. పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు గమనించగా.. పాప ఆపస్మారక స్థితిలో పడి ఉంది. కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు అందరితో గడిపిన చిన్నారి.. ఆడుకుంటూ మృత్యు ఒడిలోకి చేరడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..