
TSRTC: 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ (TSRTC) వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. అజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 ఏళ్లు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. వీటితో పాటు టీ-24 బస్ టికెటును ఆ రోజున రూ.75( సాధారణ రోజుల్లో రూ.120)కే అందిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తామని, ఉద్యోగులంతా అమృతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని సూచించారు.
ఇండిపెండెన్స్‌డే ఆఫర్లివే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం