Telangana: అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకోవడనికి రైతు వినూత్న ఆలోచన.. దెబ్బకు పరార్..

|

Oct 14, 2022 | 10:03 AM

వ్యవసాయాన్ని, సాగు చేసే వారిని చాలా మంది చిన్న చూపు చూస్తారు. కానీ, ఒకసారి అందులోకి దిగితో కానీ తెలియదు.. శ్రమ ఎంతో, కష్టనష్టాలు ఏంటో.

Telangana: అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకోవడనికి రైతు వినూత్న ఆలోచన.. దెబ్బకు పరార్..
Farmer
Follow us on

వ్యవసాయాన్ని, సాగు చేసే వారిని చాలా మంది చిన్న చూపు చూస్తారు. కానీ, ఒకసారి అందులోకి దిగితో కానీ తెలియదు.. శ్రమ ఎంతో, కష్టనష్టాలు ఏంటో. ఒక రైతు ఒక పంట పండించాలంటే అష్టకష్టాలకోర్చాల్సి ఉంటుంది. దుక్కి దున్నింది మొదలు, విత్తనాలు వేయడం, చీడపీడలను ఎదుర్కోవడం, ప్రకృతి వైపరిత్యాలను తట్టుకోవడం సహా అనేక కష్టనష్టాలను తట్టుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు వేయగానే.. మొక్క వస్తుందా? లేదా? అనే టెన్షన్ ఒకటి.. మొక్క పెరిగి పెద్దయ్యాక చీడపీడ బెడద, కలుపు మొక్కల పెడద, వీటన్నింటినీ చెక్ పెట్టేందుకు రకరకాల మందులు వాడుతారు. ఇంతవరకు ఓకే కానీ, ప్రకృతి వైపరిత్యాలను తట్టుకోవడం రైతులకు పెద్ద టాస్క్, వర్షాలు సంగతి దేవుడెరుగు కానీ, అటవి జంతువులు రైతులకు పెద్ద తలనొప్పిగా పరిణమిస్తాయి. అవి చేతికొచ్చిన పంటలను సైతం నాశనం చేస్తాయి. వాటిని నిలువరించడం రైతులకు పెద్ద భారంగా ఉంటుంది.

అయితే, తాజాగా ఓ రైతు తన పంటను అటవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు వినూత్న ప్రయోగం చేశాడు. సరికొత్త ఆలోచనతో జంతువులకు చెక్ పెట్టాడు. వివరాల్లోకెళితే.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని చోండి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు వినూత్న ఆలోచన చేశారు. తనకు ఉన్న 3 ఎకరాలలో పంట సాగు చేస్తున్న లక్ష్మన్.. పత్తి చేను వేశాడు. అయితే, ఆ చేనును అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి. దాంతో తన పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడనికి వినూత్న ఆలోచన చేశాడు. మనుషుల రూపంలో ఉన్న బొమ్మలను తయారు చేసి పంట చేనులో పెట్టాడు. ఒక ఆడ బొమ్మ, ఒక మగ బొమ్మను తయారు చేసి పంట చెనులో రక్షణగా ఏర్పాటు చేశారు.

పంట చెనులో గట్టు వద్ద రెండు బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలు ఏర్పాటు చేసిన నుంచి అటవీ జంతువుల పంటను రక్షించుకుంటున్నాడు రైతు లక్ష్మణ్. 3 ఎకరాల్లో పత్తి, సోయా సాగు చేస్తున్నానని, పంట వేసిన నుంచి అటవీ జంతువుల బెడద బాగా ఉండేదన్నాడు. అయితే, పంటను కాపాడుకోవడానికి తనకు తోచిన ఆలోచనలతో మనుషులను పోలీవున్న రెండు బొమ్మలను ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చాడు. ఆ బొమ్మలను ఏర్పాటు చేసినప్పటి నుంచి అడవి జంతువులు రావడం లేదని వివరించాడు. 10 సంవత్సరాల క్రితం కూడా ఈ ఆలోచనతో పంటను కపడుకున్నానని రైతు పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..