Dharani Portal: ‘ధరణి’ వెబ్‌సెట్ ప్రారంభంలో కొంత ఇబ్బందులు తలెత్తినా.. రోజులు గడుస్తున్నా కొద్ది అధికారులు దాన్ని మరింత విస్తృతపరుస్తున్నారు. భూ లావాదేవీలకు సంబంధించి అన్ని వ్యవహారాలను ‘ధరణి’ ద్వారా చేపడుతున్న అధికారులు.. తాజాగా మరో ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘ధరణి’ వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్‌లో ప్రత్యేకంగా ‘అప్లికేషన్ ఫర్ జీపీఏ’ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భూముల అమ్మకాలకు సంబంధించి, మార్టిగేట్, గిఫ్ట్ డీడ్, పీవోఏల్లో జీపీఏ కల్పించే అవకాశం కల్పించారు. ఈ ఆప్షన్ ద్వారా భూ యజమాని పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్‌ను ఎంటర్ చేసి ఏ సర్వే నెంబర్‌లోని భూమికి ఏ విధమైన జీపీఏ ఇవ్వనున్నారు అనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే జీపీఏ పొందే వ్యక్తి పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
Also read: