AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారుల నిర్లక్ష్యం.. వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న సింగూర్ ప్రాజెక్ట్, మంజీరా బ్యారేజీలు ఇప్పుడు అధికారుల ఘోర నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రతతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతుంటే... మరోవైపు ప్రాజెక్టు గేట్ల లీకేజీల వల్ల రోజుకు లక్షలాది లీటర్ల విలువైన నీరు వృధాగా దిగువకు కొట్టుకుపోతోంది.

అధికారుల నిర్లక్ష్యం.. వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు!
Water Leakage At Singur Project
P Shivteja
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 3:29 PM

Share

రాష్ట్ర రాజధానితో పాటు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయిని గా ఉన్న సింగూర్ ప్రాజెక్ట్, మంజీరా బ్యారేజీలు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఓ వైపు ఎండలు దంచి కొడుతుండటం,వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంటే… మరోవైపు గేట్ల లీకేజీల వల్ల రోజుకు లక్షలాది లీటర్ల విలువైన నీరు వృధాగా నది పాలవుతోంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినా స్థానిక అధికారుల్లో చలనం లేకపోవడం పై ప్రజలు,రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చే సింగూర్,మంజీరా జలాశయాలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో గేట్ల నిర్వహణ లోపం వల్ల ఊహించని స్థాయిలో నీటి వృధా జరుగుతోంది..నిన్న మొన్నటి వరకు సాగు,తాగునీటితో కళకళలాడిన ఈ జలాశయాలు.. ఇప్పుడు లీకేజీల పుణ్యమా అని డెడ్ స్టోరేజ్ స్థాయికి పడిపోయాయి..ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన తరుణంలో,అధికారుల నిర్లక్ష్యం వల్ల అమూల్యమైన జలాలు వృధాగా దిగువకు కొట్టుకుపోతుండటం స్థానికులను ఆవేదనకు గురిచేస్తోంది…

వాస్తవానికి ఈ గేట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని,రబ్బర్ సీల్స్ మార్చాలని రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.అయినా ఇక్కడి నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగూర్ ప్రాజెక్టులోని కొన్ని గేట్లకు తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప, శాశ్వత పరిష్కారాన్ని చూపలేదు.అధికారుల ఈ అలసత్వమే ఇప్పుడు సంగారెడ్డి పాలిట శాపంగా మారింది.

ఇవి కూడా చదవండి

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండుకోవడంతో జిల్లాలో ఇప్పటికే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి..ఇక ఈ లీకేజీల ప్రభావం ఇప్పుడు తాగునీటి సరఫరాపై కూడా తీవ్రంగా పడింది. చాలా గ్రామాల్లో,పట్టణాల్లో మంచినీటి సమస్య జటిలంగా మారింది. ప్రజలు గొంతు ఎండకుండా ఉండేందుకు మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఎల్ నినో పరిస్థితులు భయపెడుతుంటే.. ఉన్న నీటిని కూడా కాపాడుకోలేకపోవడం అధికారుల అసమర్థతకు అద్దం పడుతోందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..