3 / 5
ఇక రోజులు గడుస్తున్నా కూడా, ఆ పాఠశాలను ఎవరు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల కష్టలు చూసిన నవీన్ గుప్తా ముందుకు వచ్చారు. తన సొంత డబ్బులు తొమ్మిది లక్షల వరకు ఖర్చు చేసి, ఆ ప్రభుత్వ బడి నిర్మణాన్ని పూర్తి చేయించారు. ఏదో పేరు కోసం పనిచేయకండ ఆ పాఠశాలను ప్రైవేటు బడికి ధీటుగా చేయించాడు. గతంలో కాంట్రాక్టర్ స్లాబ్ వేసి, సగంలోనే పనులను నిలిపివేయాగా తన సొంత డబ్బులతో మధ్యలో నిలిచిపోయిన స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. దీనికి తోడు ప్రైవేట్ స్కూళ్లలో ఏ విధంగా అయితే విద్యార్థిని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయో ఆ విధంగానే ఈ ప్రభుత్వ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకొని స్కూల్ భావన నిర్మాణాన్ని పూర్తి చేశాడు.