Nagarjuna Sagar Bypoll: పొలిటికల్ హీట్ పెంచుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక.. కీలక వ్యాఖ్యలు చేసిన జానారెడ్డి..

Nagarjuna Sagar Bypoll: నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేతులున్నాయి.

Nagarjuna Sagar Bypoll: పొలిటికల్ హీట్ పెంచుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక.. కీలక వ్యాఖ్యలు చేసిన జానారెడ్డి..
Janareddy

Updated on: Apr 02, 2021 | 2:12 PM

Nagarjuna Sagar Bypoll: నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేతులున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతల పరస్పర విమర్శలతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగర్ అభివృద్ధి విషయంలో టిఆర్ఎస్ నేతలు, మంత్రులు అవగాహనా రాహిత్యంతో తనపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు ఇక్కడ టీవీ9తో మాట్లాడిన ఆయన.. టిఆర్ఎస్ నేతల విమర్శలకు స్పందించాల్సిన స్థాయి తనది కాదన్నారు. అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు వస్తే తాను స్పందిస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, ప్రజలను ప్రలోభ పెట్టకుండా గెలవలేమని భయంతోనే అడ్డగోలు ప్రచారానికి తెరలేపారని జానారెడ్డి ఫైర్ అయ్యారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, ప్రజలను ప్రలోభ పెట్టకుండా ఎన్నికలకు రావాలని ప్రతిపాదన చేస్తే ఇప్పటి వరకు టీఆర్ఎస్ స్పందించలేదని విమర్శించారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసమే తాను ఈ ప్రతిపాదన చేశానని, టీఆర్ఎస్ మాత్రం దానికి వెనుకడుగు వేస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యంతో ప్రజలను ప్రలోభ పెడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతల ప్రవర్తనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తన విజయం నల్లేరు మీద నడకే అని జానారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతారని అన్నారు.

Also read:

Two Wheeler Sales: మార్చి నెలలో భారీగా పెరిగిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. ప్రజలు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు

Kalyana Venkateswara Swamy: జాతకదోషంతో పెళ్లికాని ప్రసాదులు ఈ స్వామివారికి కళ్యాణం జరిపించి కంకణం ధరిస్తే.. వెంటనే వివాహం