Nagarjuna Sagar By Election Results 2021 Highlights: నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం..

| Edited By: Ram Naramaneni

May 02, 2021 | 10:45 PM

Nagarjuna Sagar Assembly By Election Results 2021 LIVE Counting and Updates:నాగార్జున సాగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ దిశ‌గా పయనిస్తోంది....

Nagarjuna Sagar By Election Results 2021 Highlights: నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్  విజయం..

Nagarjuna Sagar Assembly By Election Results 2021 LIVE Counting and Updates: నాగార్జున సాగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. సాగ‌ర్ ప్ర‌జ‌లు కారుకు విజయాన్ని అందించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌ విజ‌యం అందుకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 18,872 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 May 2021 03:22 PM (IST)

    సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో విజ‌యంతో టీ ఆర్ ఎస్ భ‌వ‌న్ లో సంబ‌రాలు

    సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో విజ‌యంతో టీ ఆర్ ఎస్ భ‌వ‌న్ లో సంబ‌రాలు అంబరాన్ని అంటాయి. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మంత్రి త‌ల‌సాని పేర్కొన్నారు. కేసీఆర్ ప‌నితీరుకు ఉపఎన్నిక ఫ‌లితాలు నిద‌ర్శ‌న‌మ‌ని, బీజేపీకి సాగ‌ర్ లో డిపాజిట్ కూడా ద‌క్క‌లేద‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

  • 02 May 2021 03:18 PM (IST)

    ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలే విజ‌యానికి కార‌ణం: నోముల భ‌గ‌త్

    త‌న మీద న‌మ్మ‌కంతో సాగ‌ర్ ప్ర‌జ‌లు గెలుపును క‌ట్ట‌బెట్టార‌ని నోముల భ‌గ‌త్ చెప్పారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో విజ‌యం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలే త‌న విజ‌యానికి కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామిల‌ను నెర‌వేర్చుతాన‌ని నోముల భ‌గ‌త్ చెప్పారు. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యంతో టీ ఆర్ ఎస్ భ‌వ‌న్ లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి.

  • 02 May 2021 02:55 PM (IST)

    18,872 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజయం

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. సాగ‌ర్ ప్ర‌జ‌లు కారుకు విజయాన్ని అందించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌ విజ‌యం అందుకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 18,872 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

    నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల లెక్కింపు పూర్తి…

    నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల లెక్కింపు పూర్తి…

    18872 ఓట్ల మెజారిటీతో టిఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భగత్ ఘన విజయం..

    టిఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు…89804

    కాంగ్రెస్…70932

    బీజేపీ…7676

    చపాతీ రోలర్…2915

    టీడీపీ…1714

     

  • 02 May 2021 02:51 PM (IST)

    24వ రౌండ్ ముగిసేస‌రికి 18,414 ఓట్ల ఆధిక్యంలో TRS పార్టీ అభ్య‌ర్థి

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో ఓటరు దేవుడు అధికార పార్టీకి దాదాపు అనుకూలంగా తీర్పును ఇచ్చాడు. మొత్తం 25 రౌండ్ల‌కు గానూ 24 రౌండ్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు సాగ‌ర్ ఓట‌ర్లు మంచి విజ‌యాన్ని అందించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్న టీఆర్ఎస్ పార్టీ 24వ రౌండ్ ముగిసేస‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి 18,414 ఓట్ల ఆధిక్యంతో ముంద‌జంలో ఉన్నారు.

  • 02 May 2021 02:44 PM (IST)

    23 రౌండ్లో17,614 ఓట్ల ఆధిక్యంలో TRS

    సాగ‌ర్ ఉప ఎన్నికల పోరులో కారు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యం దిశ‌గా సాగుతోంది. మొత్తం 25 రౌండ్ల‌కు గానూ 23 రౌండ్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు సాగ‌ర్ ఓట‌ర్లు విజయాన్ని అందించడమే కాకుండా మెజార్టీని కూడా అందిస్తున్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్న టీఆర్ఎస్ పార్టీ 23వ రౌండ్ ముగిసేస‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి 17,614 ఓట్ల ఆధిక్యంతో ముంద‌జంలో ఉన్నారు.

  • 02 May 2021 02:38 PM (IST)

    విజయానికి చేరువలో TRS

    సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో విజయానికి చేరువలో ఉంది అధికార పార్టీ టీఆర్ఎస్. మొత్తం 25 రౌండ్ల‌కు గానూ 22 రౌండ్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు సాగ‌ర్ ఓట‌ర్లు విజయాన్ని అందిస్తున్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్న టీఆర్ఎస్ పార్టీ 22వ రౌండ్ ముగిసేస‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి 16,765 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు.

  • 02 May 2021 02:26 PM (IST)

    20వ రౌండ్ కౌంటింగ్ ముగిసేస‌రికి ఫలితాలు ఇలా..

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయానికి దగ్గరగా ఉంది.  మొత్తం 25 రౌండ్ల‌కు గానూ 20 రౌండ్ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. 20వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 1080 ఓట్ల ఆధిక్యం చేకూరింది. 20వ రౌండ్ కౌంటింగ్ ముగిసేస‌రికి అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 15,556 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. ఇంకా ఐదు రౌండ్ల ఫ‌లితాలు వెలువ‌డాల్సి ఉంది.

  • 02 May 2021 02:23 PM (IST)

    19వ రౌండ్ ముగిసేస‌రికి…

    తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయానికి దగ్గరగా చేరుకున్నాడు.  19వ రౌండ్ ముగిసేస‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి 14,476 ఓట్ల ఆధిక్యంతో ముంద‌జంలో ఉన్నాడు.

  • 02 May 2021 01:55 PM (IST)

    విజయం దిశగా కారు

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. మొత్తం 25 రౌండ్ల‌కు గానూ 19 రౌండ్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఇక ఆరు రౌండ్ల ఫ‌లితాలు మాత్రమే మిగిలివుంది. అవి కూడా మ‌రికాసేప‌ట్లో వెలువడ‌నున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు సాగ‌ర్ ఓట‌ర్లు మంచి విజ‌యాన్ని అందిస్తున్నారు.

  • 02 May 2021 01:48 PM (IST)

    ఇంకా 7 రౌండ్లు లెక్కిస్తే…

    నాగార్జున సాగర్‌లో 18 రౌండ్లు అయ్యాయి. వాటిలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కి 13,396 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా 7 రౌండ్లు లెక్కిస్తే సరిపోతుంది. ఇక టీఆర్ఎస్ గెలిచినట్లే అని మనం అంచనాకు రావచ్చు.

  • 02 May 2021 01:39 PM (IST)

    18వ రౌండ్ ముగిసేస‌రికి TRS పార్టీ అభ్య‌ర్థి 13,396 ఓట్ల లీడ్

    సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్న కారు 18వ రౌండ్ ముగిసేస‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి 13,396 ఓట్ల ఆధిక్యంతో ఉన్నాడు.

  • 02 May 2021 01:35 PM (IST)

    17వ రౌండ్ ముగిసేస‌రికి టీఆర్ఎస్ లీడ్..

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్న టీఆర్ఎస్ పార్టీ 17వ రౌండ్ ముగిసేస‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి 11,581 ఓట్ల ఆధిక్యంతో ఉన్నాడు. తొలి రౌండ్‌ నుంచి టీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో దూసుకుపోతోంది.

  • 02 May 2021 01:29 PM (IST)

    14వ రౌండ్‌లో వెనుకబడినా… 15వ రౌండ్‌లో పుంజుకున్న…

    నాగార్జున సాగర్‌ బైపోల్‌ కౌంటింగ్‌‌లో ముందు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నాడు. అయితే కొన్ని రౌండ్స్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జానా లీడ్ లోకి వచ్చాడు. అయితే 14వ రౌండ్‌లో వెనుకబడిన TRS  15వ రౌండ్‌లో తిరిగి పుంజుకుంది. దీంతో ఆధిక్యం 10 వేల దిశగా సాగుతోంది. ఈ రౌండ్‌లో TRSకు 3,203, కాంగ్రెస్‌కు 2,787 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు TRS అభ్యర్థి భగత్‌కు 52,460… కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డికి 42,618 ఓట్లు వచ్చాయి.

     

  • 02 May 2021 01:21 PM (IST)

    సాగర్ ఎన్నికల్లో ఇంకా ఎన్ని రౌండ్లున్నాయంటే…

    నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వేగంగా కొనసాగుతోంది. మొత్తంగా 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 15 రౌండ్ల ఫలితాలు వెలువడగా, 10 రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉంది.

  • 02 May 2021 01:17 PM (IST)

    15వ రౌండ్‌ ముగిసే సరికి టీఆర్ఎస్ పరిస్థితి ఇది…

    15వ‌ రౌండ్ ముగిసే స‌రికి 9,914 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి.

  • 02 May 2021 12:49 PM (IST)

    10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యం

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల లెక్కింపు వేగంగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నాడు. ప్ర‌తీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తోంది. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 12:19 PM (IST)

    11 రౌండ్లలో నోముల భగత్‌కు…

    నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ జరుగుతోంది. 11వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం… TRS అభ్యర్థి నోముల భగత్‌ 9,034 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. మొత్తం 11 రౌండ్లలో నోముల భగత్‌కు 38,924 ఓట్లురాగా,  కాంగ్రెస్‌కు 29,890 ఓట్లు పోలయ్యాయి.

  • 02 May 2021 12:16 PM (IST)

    పది రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి..

    నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక  కౌంటింగ్‌ వేగంగా సాగుతోంది. పది రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి TRS 7,964 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు TRS అభ్యర్థి నోముల భగత్‌కు 35,529 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి జానా రెడ్డికి 27,565 ఓట్లు వచ్చాయి.

  • 02 May 2021 12:14 PM (IST)

    13వ‌ రౌండ్ ముగిసే స‌రికి…

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మెజార్టీ దిశ‌గా ముందుకు సాగుతున్నాడు. ప్ర‌తీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. 13వ‌ రౌండ్ ముగిసే స‌రికి 10,581 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నాడు.

  • 02 May 2021 11:40 AM (IST)

    9వ రౌండ్‌లో కూడా…

    సాగర్ లో కౌంటింగ్ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నాడు. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు, బీజేపీకి 2,879 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు .

  • 02 May 2021 11:31 AM (IST)

    8వ రౌండ్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంది…

    సాగర్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఎనిమిది రౌండ్లు ముగిశాయి. తాజా వివరాల ప్రకారం TRS 7,888 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. TRS అభ్యర్థి నోముల భగత్‌కు 30,333 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్‌ అభ్యర్థి జానా రెడ్డికి 22,445 ఓట్లు వచ్చాయి.

  • 02 May 2021 11:14 AM (IST)

    7వ రౌండ్‌లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే…

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది.  రౌండ్లలో టీఆర్ఎస్  27,084, కాంగ్రెస్ 20,552, బీజేపీ 2,112 ఓట్లు వచ్చాయి. సాగర్‌లో 7 రౌండ్ల తర్వాత టీఆర్ఎస్‌కు 6,532 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 10:53 AM (IST)

    ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో…

    నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో
    1వ రౌండ్ – TRS ఆధిక్యం… 1475
    2వ రౌండ్ – TRS ఆధిక్యం… 741
    3వ రౌండ్ – TRS ఆధిక్యం… 539
    4వ రౌండ్ – TRS ఆధిక్యం… 984
    5వ రౌండ్ – TRS ఆధిక్యం… 766
    6వ రౌండ్ – TRS ఆధిక్యం… 940
    7వ రౌండ్ – TRS ఆధిక్యం… 1415
    ఇప్పటివరకూ మొత్తం ఆధిక్యం 6592…
  • 02 May 2021 10:50 AM (IST)

    సాగర్ ఫలితాల్లో దూసుకుపోతున్న కారు

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు విడుదలైన అన్ని ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్తుండ‌టంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు..

  • 02 May 2021 10:14 AM (IST)

    ఐదో రౌండ్‌లో నోములకు ఎంత మెజార్టీ అంటే..

    సాగ‌ర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వస్తున్న ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు.. వ‌రుస‌గా తొలి ఐదు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఐదో రౌండ్ ముగిసే స‌రికి 4,334 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు.

  • 02 May 2021 09:55 AM (IST)

    మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పరిస్థితి ఇది…

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. వ‌రుస‌గా తొలి మూడు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్ల‌ మెజార్టీతో ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి.

  • 02 May 2021 09:29 AM (IST)

    రెండో రౌండ్‌లో టీఆర్ఎస్ దూకుడు..

    నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్ల మెజార్టీ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి.

     

  • 02 May 2021 09:01 AM (IST)

    తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు…

    సాగ‌ర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌ లీడ్ లో ఉంది. ఇక తొలి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ 1,475 ఓట్ల‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి.

  • 02 May 2021 08:48 AM (IST)

    తొలి రౌండ్ లో టీఆర్ఎస్ లీడ్…

    తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి 1,475 ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు.

    Trs : 4228,
    cong 2753

  • 02 May 2021 08:28 AM (IST)

    కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం…

    మొదట సుమారు1500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు…. ఆ తరువాత ముందుగా ఇలా లెక్కింపు ఉంటుంది.
    1. గుర్రంపోడ్ మండలం ఓట్లు లెక్కిస్తారు…తరువాత..
    2. పెద్దవురా మండలం ఓట్లు
    3. తిరుమలగిరి సాగర్ మండలం.ఓట్లు.
    4. అనుముల మండలం..ఓట్లు
    5. నిడమనూరు మండలం..ఓట్లు
    6. మడుగులపల్లి మండలం..ఓట్లు
    7. త్రిపురారం మండలం
    ఓట్లు లెక్కిస్తారు……

  • 02 May 2021 08:25 AM (IST)

    పోటీలో 41 మంది అభ్యర్థులు

    ఈసీ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. ఈ విధులకు హాజరయ్యే వారందరికీ ప్రత్యేకంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, ఏజెంట్లకు ఒకరోజు ముందుగానే… లెక్కింపు కేంద్రం ప్రాంగణంలో పరీక్షలు చేశారు. మూడంచెల భద్రత వ్యవస్థతో పాటు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌  అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులతో కలిపి 41 మంది పోటీ చేశారు.

  • 02 May 2021 08:20 AM (IST)

    నల్గొండలోని గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో లెక్కింపు

    నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. నల్గొండలోని గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ జరుగుతోంది. ​తొలుత గుర్రంపోడు.. చివరన త్రిపురారం మండల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. గత నెల 17న సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. రెండు హాళ్లలో 14 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ​మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది.

  • 02 May 2021 08:11 AM (IST)

    ఓట్ల లెక్కింపు ఇలా…

    సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,20,206… ఇందులో పోలైన ఓట్లు 1,89,782…, నమోదైన పోలింగ్ శాతం… 86.18% నమోదు.., 25 రౌడ్స్ లాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో రౌండ్ లో 7500, ఓట్లు లెక్కించనున్నారు.

  • 02 May 2021 07:51 AM (IST)

    25 రౌండ్లలో లెక్కింపు..సాయంత్రం ఏడు గంటలకు…

    నల్లగొండలో ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలు కానుంది. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు జరుగనున్నది.  మొదటి ఓట్ల లెక్కింపు సరళి 9 గంటలకు వెలువడనున్నది. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉన్నదని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వెల్లడించారు.

  • 02 May 2021 07:23 AM (IST)

    మరికాసేపట్లో ప్రారంభం కానున్న నాగార్జున సాగర్ ఓట్ల లెక్కింపు…

    మరికాసేపట్లో ప్రారంభం కానున్న నాగార్జున సాగర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఉదయం 8 గంటల నుంచి నల్గొండ జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు షురూ. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ.

Follow us on