Watch Video: బిగ్ అలర్ట్.. పట్టాలపైకి భారీగా వరద నీరు.. నిలిచిపోయిన పలు రైళ్లు..

మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి..

Watch Video: బిగ్ అలర్ట్.. పట్టాలపైకి భారీగా వరద నీరు.. నిలిచిపోయిన పలు రైళ్లు..
Dornakal station flooded

Updated on: Oct 29, 2025 | 12:36 PM

మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి.. డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, మహబూబాబాద్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు నిలిపివేశారు.

వీడియో చూడండి..

తెలంగాణపైనా మొంథా తుఫాన్‌ ప్రభావం పడింది. బుధవారం ఉదయం నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు ప్రవహిస్తుండటంతో.. రాకపోకలు నిలిచిపోయాయి..

హైదరాబాద్ నగరంలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్

తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో అన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజర హిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం, అబిడ్స్ ,ఎల్బీనగర్ ,వనస్థలిపురం ప్రాంతాలలో వర్షం కురిసింది. రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తుఫాన్ ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితే.. తప్ప బయటకు రావొద్దంటూ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..