Telangana: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు నిధులు విడుదల ఆ తేదీ నుంచే

|

Jun 22, 2022 | 7:06 PM

రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు విడుదలయ్యాయి.

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు నిధులు విడుదల ఆ తేదీ నుంచే
Rythu Bandhu
Follow us on

Telangana Farmers: తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచి వానాకాలం రైతుబంధు నిధులు.. అర్హుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌(CS Somesh Kumar )ను ఆదేశించారు. దీంతో వెంటనే సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీజన్లో రైతు బంధు కోసం దాదాపు 8 వేల కోట్లు అవసరం అవుతాయని తెలుస్తోంది. వాటిని సమీకరించిన ప్రభుత్వం ఈ నెల 28 నుంచి నిధుల్ని విడుదల చేయబోతోంది. తొలుత తక్కువ భూవిస్తీర్ణం రైతుల నుంచి మొదలుకొని క్రమంగా అందరి ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు.  కాగా రైతుబంధుపై వివరాలు తెలుసుకునేందుకు, ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విజ్ఞప్తులు తీసుకునేందుకు ఈ కాల్‌ సెంటర్‌ను ఉపయోగపడుతుందని చెప్పారు.  కాగా వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం 10వేల రూపాయలను ప్రభుత్వం ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లు. ఇప్పుడు రైతుబంధు డబ్బులు. తెలంగాణలో రాజకీయం రైతుల చుట్టూనే తిరుగుతోంది. రైతు బంధు పథకం ఈసారి రాజకీయ రంగు పులుముకుంటోంది. రైతు బంధు ఆలస్యంపై విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. అయితే నిధుల ఆలస్యానికి కేంద్రమే కారణమని అటాక్‌ చేస్తోంది గులాబీ దళం. ఈ క్రమంలోనే ఈ నెల 28 నుంచి నిధుల్ని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి