Telangana Weather Report : ఉత్తర బంగాళా ఖాతం చుట్టు పక్కల ప్రాంతాల్లో సముద్రమట్టానికి1.5 కి మీ నుంచి 5.8 కి మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది నైరుతి దిశకి వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావం వల్ల ఈ నెల 28వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల రాగల మూడురోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉండనున్నాయి.
ఈ రోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని ప్రదేశములలో వర్షం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నవి. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఒకటి, రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. దీని ప్రభావం ఈ జిల్లాలపై ఎక్కువగా పడుతుంది.
ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా రాష్ట్రం వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. రాగల మూడు రోజుల వరకు వాతావరణలో మార్పుకు కనిపించనున్నాయి.