గులాబీ తోటలో తుఫాను.. తేరుకునేలోపే వరుస షాకులు.. అసలు టార్గెట్ ఎవరు?

గులాబీ తోటలో కవిత సృష్టించిన తుఫాన్‌ ఎప్పుడు తీరం దాటుతుంది. కవిత మాటల్లో టంగ్‌ట్విస్టర్స్‌ కనిపిస్తున్నాయి. కేవలం కేసీఆర్‌ నాయకత్వంపైనే తనకు నమ్మకం, విశ్వాసం ఉంది అంటున్నారు. అంటే.. మిగతా వాళ్లపై అవిశ్వాసం, అపనమ్మకం ఉన్నట్టనుకోవాలా? ఆమాటకొస్తే.. నాయకత్వం వహించడానికి తనకేం తక్కువ అనే సంకేతాలు పంపుతున్నారు

గులాబీ తోటలో తుఫాను.. తేరుకునేలోపే వరుస షాకులు.. అసలు టార్గెట్ ఎవరు?
Kavitha

Edited By: Ravi Kiran

Updated on: May 31, 2025 | 9:57 PM

ఎమ్మెల్సీ కవిత ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ ఎంతో తెలంగాణ జాగృతి కూడా అంతే అనే స్పష్టత ఇచ్చేశారు. అంటే.. పార్టీ నాయకత్వం ఎంతో తెలంగాణ జాగృతికి నాయకత్వం కూడా అంతే అని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి కేసీఆర్‌కు రెండు కళ్లు అని చెప్పడం ద్వారా.. సమాంతర నాయకత్వాన్ని కవిత ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది. ఇంతకీ.. కవిత వ్యాఖ్యలను ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. నాయకత్వం కోసం పోరాటమా, లేక అస్తిత్వం కోసమా అనే విషయంపై ఇంత రగడ జరుగుతోంది. అందులో నో డౌట్. కవిత చేస్తున్న పోరాటాలు, వేస్తున్న అడుగులు, వస్తున్న మాటలు అన్నీ అదే అర్ధాన్ని ఇస్తున్నాయి. పార్టీలో తనకు కూడా సమాంతర ప్రాధాన్యతను కచ్చితంగా ఇవ్వాల్సిందేనన్న విషయాన్ని చాలా గట్టిగా బయటపెట్టారు. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్‌ కింద పనిచేయడం అనే సెన్స్‌ కనిపించకుండా.. బీఆర్ఎస్‌తో పాటుగా తెలంగాణ జాగృతి కూడా పనిచేస్తుంది అనే క్లియర్‌ కట్‌ సంకేతాలిచ్చేశారు కవిత. జాగృతి సంస్థకు 18 ఏళ్లుగా తమ అధినేత ఆశీస్సులు ఉన్నాయంటూ కేసీఆర్‌ను కూడా జోడించారు. తెలంగాణ జాగృతి తరపున తాము చేయని పోరాటం లేదు, తీసుకోని అంశం లేదు అని స్పష్టం చేశారు. అంటే.. బీఆర్ఎస్‌ ఎంతో జాగృతి కూడా అంతే అని చెప్పకనే చెప్పారు. ఇకపైనా.. తెలంగాణ జాగృతితోనే తన ప్రయాణం అనే సంకేతాలిచ్చారు కవిత. రానున్న...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి