MLC election in Telangana: మందుబాబులకు షాక్.. మద్యం అమ్మకాలు బంద్.. తెరుచుకునేది ఎప్పుడంటే..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సందడి కొనసాగుతోంది. సాధారణంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయనున్నారు.

MLC election in Telangana: మందుబాబులకు షాక్.. మద్యం అమ్మకాలు బంద్.. తెరుచుకునేది ఎప్పుడంటే..
wine shops closed

Updated on: Mar 11, 2021 | 8:01 PM

Wine Shops to Remain Closed Tomorrow: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సందడి కొనసాగుతోంది. సాధారణంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఆ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకూ, ఎన్నికల కౌంటింగ్ జరగనున్న 17వ తేదీన మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి.

ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో మాత్రమే..

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2200 వైన్స్ షాపులు, 1400 బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలో బార్లు ఉన్నాయి. రాష్టంలో ఈ నెల 14వ తేదీన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాలలో జరుగుతున్నాయి. ఈ పరిధిలో మద్యం అమ్మకాలు బంద్ చేస్తున్నారు.

దీంతో ఎన్నికల ప్రచారం ముగిసిన 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలు జరగనున్న 14వ తేదీ వరకూ మద్యం షాపులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు బంద్ కానున్నాయి. అంతే కాకుండా ఎన్నికల ఫలితాల రోజైన 17వ తేదీ కూడా మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 4 రోజుల మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో..

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి శుక్రవారం 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ సీపీ సజ్జనార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, వైన్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు అన్నింటిని రెండు రోజుల పాటు మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

Gunathilaka Out or not?: లంక, విండీస్ వన్డేలో వివాదం.. బంతిని కాళ్లతో తన్నాడని బ్యాట్స్‌మెన్ గుణతిలక ఔట్..!

Jati Ratnalu Movie: ‘జాతి రత్నాలు’ ట్విట్టర్ రివ్యూ: హిట్టు బొమ్మ.. కామెడీ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ లోడింగ్.!