తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్.. రాష్ట్రంలో టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యే

|

Jan 25, 2021 | 1:53 PM

తెలంగాణలోనూ వ్యాక్సిన్‌ పంపిణీ చురుకుగా జరుగుతోంది. సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్..  రాష్ట్రంలో టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యే
Follow us on

Corona vaccine taken first MLA : కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగిస్తూ కేంద్రం అత్యవసరంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణలోనూ వ్యాక్సిన్‌ పంపిణీ చురుకుగా జరుగుతోంది. సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కరోనా టీకా తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన తన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కొన్ని జాగ్రత్తలు సూచించారు. మొదట కోవిడ్‌ వారియర్స్‌ ఉన్న వారికి టీకా వేస్తున్న నేపథ్యంలో వైద్యుల కోటాలో ఆయన టీకా వేయించుకున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో కోవిడ్ టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ నిలిచారు.

వైద్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ గతంలో కరోనా రోగులకు చికిత్స అందించి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహా రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు 5వేల ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా, రెండో విడతలో ప్రజా ప్రతినిధులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్‌ వేసుకోనున్నారు. రెండో దశలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా టీకా తీసుకోనున్నారు.

Read Also… ఏపీ డీజీపీ, హోం శాఖ కార్యదర్శిలపై హైకోర్టు సీరియస్.. ఈనెల 27న కోర్టుకు రావాలని సమన్లు జారీ..!