Rajagopal Reddy: ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా.. కారణం ఏం చెప్పారంటే..

Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డి రాజకీయ భవితవ్వం ఏంటని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా.? అన్న ప్రశ్న గతకొన్నిరోజులుగా వేధిస్తోంది. అయితే..

Rajagopal Reddy: ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా.. కారణం ఏం చెప్పారంటే..
Raj Gopal Reddy

Updated on: Aug 02, 2022 | 7:51 PM

Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డి రాజకీయ భవితవ్వం ఏంటని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా.? అన్న ప్రశ్న గతకొన్నిరోజులుగా వేధిస్తోంది. మంగళవారం రాజగోపాల్‌ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. కుండ బద్దలు కొట్టినట్లు తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన రాజగోపాల్‌ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా రాజీనామాతోనైనా మునుగోడులో అభివృద్ధి జరగాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితం కొంత మంది మాత్రమే అనుభవిస్తున్నారు. సీఎం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల అభిష్టి మేరకే రాజీనామా చేస్తున్నాను. డబ్బులు, పదవి కోసం అమ్ముడు పోవడం మా వంశంలోనే లేదు.

కష్టపడి వ్యాపారంలో సంపాదించిన సొమ్మును పేదలకు ఖర్చు చేశాము. సొంతపార్టీ, బయట నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను స్వార్థం కోసం పార్టీ మారుతున్నా అంటున్నారు.. నిజంగా నేను స్వార్థపరుడినై ఉంటే, 2018లో కేసీఆర్‌ ఫోన్‌ చేసిన రోజే టీఆర్‌ఎస్‌లో చేరే వాడిని. నా రాజీనామాతో టీఆర్‌ఎస్‌ మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందంటే మొదటగా సంతోషించే వ్యక్తిని నేనే’ అని చెప్పుకొచ్చారు.

రాజగోపాల్‌ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..