జనగామ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. కూతురు తుల్జాభవాని చేసిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చే క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు..తన కూతురు భూమి ఎక్కడా ఫోర్జరీ కాలేదని.. ఆస్తి తనపేరు మీదనే ఉందని స్పష్టం చేశారు. కేవలం లీజ్ అగ్రిమెంట్‌ను మాత్రమే పొడిగించామన్నారు.
తమ కుటుంబ సమస్యని రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారుని ఆరోపించారు ముత్తిరెడ్డి. ఎలక్షన్ల ముందు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తన ఇంటి సమస్యను ప్రజాజీవితానికి ఆపాదించడం సరికాదని చెప్పారు ముత్తిరెడ్డి..
ఉప్పల్ పీఎస్‌లో ముత్తిరెడ్డిపై కూతురు తుల్జాభవాని రెడ్డి ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమిని లాక్కున్నారని ఆరోపించారు.గతంలోనూ ఈ భూమిపై వివాదం నడిచింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు కూతురు తుల్జాభవానీ రెడ్డి ఫిర్యాదు చేయడంతో మరోసారి భూ వివాదం తెరపైకి వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..