Nalgonda: నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి పర్యటన.. 100 పకడల ఆస్పత్రికి శంకుస్థాపన

Nalgonda: తెలంగాణలో మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళవారం ఉమ్మడి..

Nalgonda: నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి పర్యటన.. 100 పకడల ఆస్పత్రికి శంకుస్థాపన

Updated on: Jun 15, 2021 | 6:41 AM

Nalgonda: తెలంగాణలో మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న మంత్రులు.. సూర్యాపేటలోని కోర్ట్‌ చౌరస్తాలో కల్నల్‌ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ చేయనున్నారు. అలాగే ఓల్డ్‌ వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక జిల్లాలోని కేతేపల్లి మండలం భీమరంలో రైతు వేదిక, వైకుంఠ దామం, హైస్కూల్‌ భవనాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అలాగే ప్రజలకు మరిన్ని వైద్య సేవలు కల్పించేందుకు నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజి పనులకు శంకస్థాపన చేయనున్నారు మంత్రులు. ఈ పర్యటనలో భాగంగా రైతు వేదికను ప్రారంభించి సభలో పాల్గొననున్నారు.

ఇవీ కూడా చదవండి:

Rythu Bandhu: నేటి నుండి తెలంగాణలో రైతు బంధు సాయం పంపిణీ.. అత్యధికంగా నల్గొండ జిల్లాకు రూ.608.81 కోట్లు

Telangana: జోడెడ్ల‌లో ఒక‌టి త‌నువు చాలించింది.. ఆ ఇంటి బిడ్డే కాడెద్దుగా మార‌డు

Follow Us