కంటోన్మెంట్‌ బకాయిలను కేంద్రం వెంటనే చెల్లించాలి.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

|

Jan 29, 2021 | 6:16 PM

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్..

కంటోన్మెంట్‌ బకాయిలను కేంద్రం వెంటనే చెల్లించాలి.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
Follow us on

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మీ జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు చేయలేరని ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని.

శుక్రవారం నాడు కేంద్ర రక్షణశాఖ పరిధిలోని కంటోన్మెంట్ మర్ట్ ఫోర్డ్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి ఎస్. వేణుగోపాల చారితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అందజేశారు.

రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ లో ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని అనేక విధాలుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి పాటు పడాలని కోరారు. రూ. 500 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని మండి పడ్డారు. వారిది నాలుకా తాటిమట్టా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డి, బోర్డు ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర రెడ్డి, బోర్డు సభ్యులు సాదా కేశవరెడ్డి, శ్రీమతి అనిత ప్రభాకర్, పాండు యాదవ్, లోకానాథం, బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టి ఎన్ శ్రీధర్ శ్రీనివాస్, ఆర్డీవో శ్రీమతి వసంత,ఎంఆర్వో మాధవి రెడ్డి తదితర అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు.