
Minister ktr Siricilla tour : రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించినున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టునున్నారు. గంభీరావుపేట మండలంలో మొదలయ్యే కార్యక్రమాలతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మంత్రి పర్యటించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు గంభీరావుపేటలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం మంత్రి.. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాఠశాలను ప్రారంభిస్తారు.
అనంతరం మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పత్రాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నర్మాలలో రైతు వేదికను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే నిర్మించతలపెట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. నర్మాలలో శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతిగదులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపల్లిలో మహిళాసంఘం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు లింగన్నపేటలో రైతు వేదికను ప్రజలకు అంకితం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు మల్లారెడ్డిపేటలో రైతువేదిక ప్రారంభోత్సవానికి హాజరవుతారు.
Read Also… ఇన్‌కం టాక్స్ ఫైల్ చేయకపోతే డబుల్ టీడీఎస్… ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్..!