Telangana: ఈవీ లకు కేంద్రంగా హైదరాబాద్.. ఇ-బైక్ ఏఆర్ క్యూను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..

|

Feb 08, 2023 | 9:09 PM

గ్రావ్టన్ మోటార్స్ నూతన ఇ-బైక్ ఏఆర్ క్యూను తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోశరవేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్ అయిన గ్రావ్టన్ మోటార్స్ అని మంత్రి కొనియాడారు....

Telangana: ఈవీ లకు కేంద్రంగా హైదరాబాద్.. ఇ-బైక్ ఏఆర్ క్యూను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..
Minister Ktr
Follow us on

గ్రావ్టన్ మోటార్స్ నూతన ఇ-బైక్ ఏఆర్ క్యూను తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోశరవేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్ అయిన గ్రావ్టన్ మోటార్స్ అని మంత్రి కొనియాడారు. హైదరాబాద్ ఇ మోటార్ షో, హైటెక్స్‌ లో ఈ రోజు ప్రారంభమైన ఈవీ ఏఆర్క్యూ అనేది బయోనిక్ డిజైన్‌తో, పూర్తి స్థాయి హెల్మెట్ బూట్ స్పేస్‌తో, మార్చుకోగలిగే బ్యాటరీ సిస్టమ్‌తో తయారైంది. కొత్త ఇ-బైక్ కచ్చితంగా ఈవీ మార్కెట్‌లో గేమ్-ఛేంజర్ అవుతుందని గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు సీఈఓ పరశురామ్ అన్నారు. ఈ వాహనానికి మూడు మోడ్‌లు ఉన్నాయి. ఈసీఓ 40, సిటీ-65, స్పోర్ట్స్-110. ఒక్కసారి ఛార్జింగ్‌తో 140 కిమీల వరకు ప్రయాణించవచ్చు. గ్రావ్టన్ మోటార్స్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద ఈవీ ర్యాలీలో పాల్గొంది. పీపుల్స్ ప్లాజాలో బైక్ విన్యాసాల ద్వారా ఈవీ ప్రియులను ఆకట్టుకుంది.

హైదరాబాద్ ఈవీ వాహనాలకు కేంద్రంగా మారుతోందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో ఈవీ కంపెనీలు పెట్టుబడులను పెడుతున్నాయన్నారు. హైదరాబాద్ ఈ మోటార్ షోలో దేశీయ కంపెనీల ఎలక్ట్రిక్ వెహికిల్స్​తో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రోజుల్లో ఈ రంగం అభివృద్ధి మరింతగా చెందుతుందన్నారు. ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీ అమర్ రాజా సంస్థ ఇప్పటికే తమ వస్తువులను తయారుచేసే యూనిట్​ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈవీ రంగానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మేం మరిన్ని వాహనాలను పరిచయం చేయడానికి, ఇ-మొబిలిటీ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ చొరవ తీసుకొని మాలాంటి ఈవీ స్టార్టప్‌లకు అద్భు తమైన అవకాశాన్ని కల్పించినందుకు మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అభినందిస్తున్నాం. అత్యధిక సంఖ్యలో విడి భాగాలను తయారు చేయగల సామర్థ్యం ఉన్న కొన్ని కంపెనీలలో ఒకటిగా నిలిచాం. మా కంపెనీకి చెందిన ఇ-బైక్.. కన్యాకుమారి నుంచి ఖర్దుంగ్ లా, మౌంటెన్ పాస్ (లడఖ్) వరకు 4,011 కిలోమీటర్లు, K2K రైడ్‌ను ఛార్జింగ్ అవసరం లేకుండా అతి తక్కువ సమయంలో ప్రయాణించింది. ఈ ఘనతతో అది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లోకి చేరింది.

ఇవి కూడా చదవండి

       – పరశురామ్, గ్రావ్టన్ మోటార్స్ సీఈఓ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం