ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్.. జిల్లా పార్టీ నేతలతో సమావేశం

|

Feb 12, 2021 | 9:37 AM

శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీ. రామారావు విస్తృతంగా పర్యటించనున్నారు.

ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్.. జిల్లా పార్టీ నేతలతో సమావేశం
Follow us on

KTR Siricilla tour : పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీ. రామారావు ఇవాళ జిల్లా పర్యటన మొదలు పెడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం పలు అభివ‌ద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తొలిత పద్మనాయక కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని టీఆర్ఎస్ నమోదు కార్యక్రమంపై దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం ఒంటిగంటకు వీర్నపల్లి మండలం మద్దిమల్ల తాండాలో ఎంపీపీ మాలోతు బూల సంతోష్‌ కుటుంబాన్ని పరమర్శించనున్నారు. అనంతరం గంభీరావుపేట మండలం సముద్రాలింగాపూర్‌లో సర్పంచ్‌ మోతె రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. రాజేశ్వర్‌రావునగర్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, గోరంటాలలో వైకుంఠధామం, పల్లె పకృతి వనాలను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్‌ తిరుగు పయనమవుతారు మంత్రి కేటీఆర్. మంత్రి పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also… సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినూత్న కార్యక్రమం.. లాంఛనంగా ప్రాంరంభించిన వినయ్‌భాస్కర్‌