Col Santosh Babu Statue: కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం మరువలేనిది.. సూర్యాపేటలో సంతోష్‌బాబు విగ్రహన్ని అవిష్కరించిన మంత్రి కేటీఆర్

|

Jun 15, 2021 | 4:42 PM

కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగానికి ఎప్పుటికీ మరువలేనిదని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు.

Col Santosh Babu Statue: కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం మరువలేనిది.. సూర్యాపేటలో సంతోష్‌బాబు విగ్రహన్ని అవిష్కరించిన మంత్రి కేటీఆర్
Ktr Inauguration Colonial Santosh Babu Statue
Follow us on

Col Santosh Babu Statue Inauguration by KTR: కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగానికి ఎప్పుటికీ మరువలేనిదని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. మంగళవారం సూర్యాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గత ఏడాది చైనా సరిహద్దుల్లో వీరపోరాటం చేసి అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్‌. గాల్వాన్‌ ఘర్షణల్లో చైనా సైనికుల్నితరిమికొట్టే క్రమంలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని.. ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోశ్‌బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌, మరో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో సంతోశ్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సంతోశ్‌బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు రూ.20లక్షల వ్యయంతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశారు. కాగా, సంతోష్‌ బాబు స్ఫూర్తితో యువత సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు ఆయన భార్య సంతోషి. సూర్యాపేటలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.

ఇదిలావుంటే, దేశం కోసం కల్నల్‌ సంతోష్‌బాబు చేసిన త్యాగం అసామాన్యం… అందుకే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌… స్వయంగా సూర్యాపేటకు వెళ్లి సంతోష్‌బాబు కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయల నగదు, కల్నల్ సంతోష్‌ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం, బంజార హిల్స్‌ ప్రాంతంలో 711 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఆదుకున్నారు. ప్రస్తుతం సంతోష్ బాబు భార్య డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో ఉన్నారు. అలానే.. సంతోష్‌బాబు జ్ఞాపకార్థం సూర్యపేటలో భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Read Also…  Covaxin Price: కొవాగ్జిన్‌ ధరలపై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన.. దీర్ఘకాలం రూ. 150కు కేంద్రానికి విక్రయించలేమని స్పష్టం!