మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు.. ఏం చేశారంటే..?

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు సుమంత్ సహా ఆరుగురిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 109 కింద కేసు పెట్టారు. ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తొలుత జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు.. ఏం చేశారంటే..?
Minister Konda Surekha Osd Sumanth

Updated on: Aug 20, 2026 | 5:54 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తనపై సుమంత్‌తో పాటు మరో ఐదుగురు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుమంత్ సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమంత్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తొలుత మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us