Jagadish Reddy : ‘2004లో వాళ్ళ బతుకేందో స్పష్టంగా ఉంది, ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా’.. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నిప్పులు

కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నల్గొండ జిల్లా మునుగోడులో నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణానదిలో నల్లగొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించింది..

Jagadish Reddy : 2004లో వాళ్ళ బతుకేందో స్పష్టంగా ఉంది, ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా.. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నిప్పులు
Jagadish Reddy

Updated on: Jul 28, 2021 | 10:24 PM

Komati Reddy – Jagadish Reddy : కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నల్గొండ జిల్లా మునుగోడులో నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణానదిలో నల్లగొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించింది ఈ దొంగలు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల ఉసురు తీసింది ఈ అన్నదమ్ములే.. 2004 లో వాళ్ళ బతుకేందో.. తరువాత వాళ్ళ బతుకు ఏందో స్పష్టంగా ఉంది. ఈ దొంగలు పిలుపు నిస్తే పదివేల మంది కదులుతార. పట్టుమని పదిమంది రాలేదు.. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా ఖబడ్ధార్” అంటూ విరుచుకుపడ్డారు జగదీష్ రెడ్డి.

“కాంగ్రెస్ పార్టీ నాయకులమా… ఏమన్నా.. జానారెడ్డా, ఉత్తమ్ రెడ్డా వాళ్ళ నోటికి బయపడడానికి.. వాళ్ళబాసులనే తరిమి తరిమి కొట్టినోళ్లాం మనం.. వీళ్లంతా ఆంధ్రోళ్ల కింద బానిసలుగా పనిచేసినోళ్లు.. 2004 లో వాళ్ళ బతుకేందో.. తరువాత వాళ్ళ బతుకు ఏందో స్పష్టంగా కనపడుతోంది. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా.. ఇప్పటి దాకా నేను ఎవరి జోలికి పోలేదు.. ఏడేండ్లలో ఇప్పటిదాకా నేను ఎవరి జోలికి పోలేదు. ఏడేండ్లలో ఒక్కళ్ళను ఒక్క మాట అనలేదు…వ్యక్తిగత జీవితాల జోలికి పోలేదు. రాజకీయాలు కూడా మాట్లాడలేదు. ఓట్లు వచ్చిన నాడు పార్టీ సభలు పెట్టుకుంటే తప్ప అంతకు మించి మాట్లాడను.. ఇది అందరికీ తెలుసు. ఎక్కువ మాట్లాడితే.. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే, నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంతకాలం సహించాను. ఇక ఇప్పుడు సహించను.” అంటూ జగదీష్ రెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై హాట్ కామెంట్స్ చేశారు.

Read also : Harishrao : కల్యాణ లక్ష్మి వద్దంటున్నారు.. 90 శాతానికిపైగా జనాభాకు బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : హరీశ్‌ రావు

Follow Us