సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి జగదీష్ రెడ్డి

| Edited By:

Aug 21, 2020 | 1:06 PM

ఈగల పెంట శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మొదటి యూనిట్‌లో అగ్ని ప్రమాదం జర

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి జగదీష్ రెడ్డి
Follow us on

Telangana Fire Accident: ఈగల పెంట శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మొదటి యూనిట్‌లో అగ్ని ప్రమాదం జరగ్గా.. నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. పది మంది బయటకు వచ్చారని, లోపల తొమ్మిది మంది చిక్కుకున్నారని.. దట్టమైన పొగ ఉండటం వలనే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారని, పొగతో మూడు సార్లు వెనక్కి వచ్చారని తెలిపారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా సంఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్నారని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, సింగరేణి సిబ్బంది సహాయం కోరామని జగదీష్ రెడ్డి వెల్లడించారు. జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని, వారు సేఫ్‌గానే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

Read More:

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. 9 మంది గల్లంతు

ఒడిషాలో భారీగా పట్టుబడ్డ గంజాయి