
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ కొనసాగుతోంది. గోట్ కప్ పేరుతో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్సి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. అయితే సింగరేణి ఆర్‌ఆర్ టీమ్ తరఫున బరిలోకి దిగిన సీఎం రేవంత్‌రెడ్డి గోల్ కొట్టడం విశేషం.
మరోవైపు మెస్సి సైతం రెండు గోల్స్ రాబట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి మెస్సి, రేవంత్ ఫొటోలు దిగారు. గ్యాలరీలో ఉన్న అభిమానులకు మెస్సి.. ఫుట్‌బాల్ కిక్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకగాంధీ కుమారుడు, కుమార్తె ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు.
Dribbles and passes with the GOAT himself! ⚽🌟
Telangana CM Shri @revanth_anumula shared a fun moment with Lionel Messi at the Rajiv Gandhi International Stadium in Hyderabad.
📍 Telangana pic.twitter.com/JcJL9g6PyO
— Congress (@INCIndia) December 13, 2025