Medaram Jatara:ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం వెళ్ళే సమ్మక్క, సారలమ్మ భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి మేడారానికి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. ఈరోజు నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ చెప్పారు.
దీంతో ఈరోజు నుంచి మేడారం వెళ్ళే భక్తులకు ఆర్టీసీ బస్సులు ప్రతి రొజూ అందుబాటులో ఉండనున్నాయి. ఈ బస్సులు ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారంకు బయల్దేరతాయి. తిరిగి సాయంత్రం 4 గంటలకు మేడారం నుంచి హన్మకొండకు చేరుకుంటాయి. అంతేకాదు ఈ బస్సు చార్జీలను కూడా నిర్ణయించింది. పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ స్పష్టం చేశారు. బస్సుల్లో ప్రయాణించే అమ్మవారి భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని ప్రయాణీకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరుపుకునే ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది. ఇప్పటికే కరోనా నిబంధనలు అనుసరిస్తూ.. పనులను పూర్తీ చేస్తున్నారు.
Also Read: