AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎలా వస్తాయ్ మావ ఇలాంటి ఐడియాలు.. పోలీసులే బిత్తరపోయారుగా

పుష్ప స్టైల్‌లో ప్లాన్.. వాహనం చూస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. పోలీసుల కన్ను మాత్రం తప్పలేదు. బీదర్ నుంచి సాగిన స్మగ్లింగ్ యాత్ర మధ్యలో ఆగిపోయింది. ఇంతకీ పోలీసులు ఈ స్మగ్లింగ్ ముఠాకు ఎవర చెక్ పెట్టారు. ఈ గ్యాంగ్‌లో ఎవరెవరు ఉన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం...

Telangana: ఎలా వస్తాయ్ మావ ఇలాంటి ఐడియాలు.. పోలీసులే బిత్తరపోయారుగా
Ganja In Auto
P Shivteja
| Edited By: |

Updated on: Jul 27, 2025 | 2:41 PM

Share

గంజాయి తరలించే వారు ప్రతిసారీ ఒక్కో తరహాలో ప్లాన్​ చేస్తున్నారు. పుష్ప సినిమాలో మాదిరిగా ఎవరికీ అనుమానం రాకుండా అక్రమంగా సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఒక ముఠాను మెదక్​ ఎన్‌ఫోర్స్‌‌మెంట్​, సంగారెడ్డి జిల్లా టాస్క్​ ఫోర్స్​ అధికారులు పట్టుకున్నారు. మెదక్​ డిప్యూటీ కమిషనర్​ హరికృష్ణ ఆదేశాల మేరకు సిబ్బంది కంకోల్​ టోల్​ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు అటుగా వచ్చిన ఓ ఆటోలో తనిఖీ చేయగా.. లోపల సీటు వెనకాల స్పీకరు బాక్సులో పెట్టి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన కంచె రాకేష్, నాంపల్లికి చెందిన శుభం, ధర్మరాజు సాయి కుమార్, లంగర్ హౌస్‌కు చెందిన పోరంపల్లి శ్రీకాంత్‌లు బీదర్ నుంచి గంజాయి తీసుకొస్తున్నారు. ఆటోలో సీటు వెనకాల ఉన్న స్పీకర్​ బాక్సులో దీనిని దాచిపెట్టారు. కవర్లో ఉంచిన అరకిలో ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న స్కూటీ, నాలుగు మొబైల్​ ఫోన్లనూ సీజ్​ చేశారు. గోవా నుంచి వస్తున్న వాహనాలనూ తనిఖీ చేశారు. వివిధ బ్రాండ్​లకు సంబంధించి 3.30 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుంకం చెల్లించకుండా ఈ మద్యం తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Ganja

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌