అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో గజగజలాడిన గ్రామస్థులు

జిల్లాకు చెందిన శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో కొండచిలువల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సికిందాలపూర్‌ బస్టాండ్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు పొలాలు, ఇళ్ల పరిసరాలు, అంగన్‌వాడీ కేంద్రాల సమీపంలోనూ పాములు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనావాసాల్లోకి వస్తున్న పాములను సురక్షితంగా పట్టుకుని అడవుల్లోకి తరలించాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు..

అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో గజగజలాడిన గ్రామస్థులు
Giant Pythons Spotted In Village

Edited By:

Updated on: Oct 05, 2026 | 11:26 AM

శివ్వంపేట, అక్టోబర్ 5: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా కొండ చిలువల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకప్పుడు అడవులు, గుట్టలకే పరిమితమైన ఈ భారీ సర్పాలు.. ఇప్పుడు నేరుగా పంట పొలాలు, రోడ్లు, చివరకు జనావాసాల్లోకి వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం వణికి పోతున్నారు. తాజాగా శివ్వంపేట మండల పరిధిలోని సికిందాలపూర్ గ్రామ బస్టాండ్‌లో ఒక భారీ కొండచిలువ ప్రత్యక్షమవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం కేటాయించిన స్థలంలో కొండచిలువ నక్కి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు, ప్రయాణికులు భయంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు. అంత అప్రమత్తం కావడంతో అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత రుప్లాతండా గ్రామపంచాయతీ పోతిరెడ్డిపల్లి తండాలోని ఇండ్ల మధ్యలోకి మరో కొండచిలువ వచ్చింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. మరో వైపు లింగోజిగూడా అంగన్వాడీ సమీపంలో రక్త పింజర వచ్చింది. ఇలా ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాల్లో రైతులు పనులకు వెళ్లినప్పుడు, పశువుల పాకల వద్ద కొండచిలువలు కనిపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి

పొలాలు, ఇళ్ల పరిసరాలు, బస్టాండ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కొండచిలువల సంచారం పెరిగిపోవడంతో అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని శివ్వంపేట మండల ప్రజలు కోరుతున్నారు. జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులను సురక్షితంగా పట్టుకుని, దట్టమైన అడవుల్లో వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి స్థానిక పెద్దలు గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు. చీకటి పడ్డాక ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా టార్చ్ లైట్లు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు వాడాలి. ఇళ్ల చుట్టూ పొదలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి.ఎందుకంటే ఇవి పాములు నక్కడానికి అనువుగా ఉంటాయి. కొండచిలువలు విషపూరితమైనవి కాకపోయినప్పటికీ, అవి పట్టు బిగిస్తే ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి వాటిని సొంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించ కుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us