Vikarabad district: హీరో విక్టరీ వెంకటేష్(Hero Venkatesh) నటించిన దృశ్యం(Drishyam Movie), దృశ్యం-2 కు సీక్వెల్‌ను తలపించేలా మర్డర్ ప్లాన్ చేశాడో వ్యక్తి. ఆస్తి కోసం సొంత వదినమ్మను… భార్య, తండ్రి సాయంతో వేధింపులు, చిత్రహింసలకు గురి చేశాడు. తీరా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ నింద తన మీదకు రాకుండా ఉండేలా సరికొత్త ప్లాన్‌ను అమలు చేశాడు నిందితుడు శ్రీనివాస్. మరిది శ్రీనివాస్ వేధింపులు తట్టుకోలేక వదిన సంగమని ఈనెల 16వ తారీఖున బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కనిపించకపోవడంతో భార్యతో కలిసి గాలించాడు మరిది శ్రీనివాస్. పోలంలోని బావిలో శవమై తేలడంతో.. గుట్టు చప్పుడు కాకుండా ఫ్రెండ్‌తో కలిసి.. శవాన్ని గోనే సంచిలో కుక్కి.. బైక్ పై తీసుకెళ్లి సింగూర్ డ్యామ్ లో పడేశాడు. ఆ తర్వాత తనకు… ఏమి తెలియదన్నట్లు చక్కగా నటించాడు. తల్లి సంగమని కనిపించడం లేదని ఆమె కూతుర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ధర్యాప్తు చేసిన పోలీసులకు శ్రీనివాస్‌పై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా బాగోతం బయటపడింది.
ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం అమ్రాదికలాన్ లో జరిగింది. సంగమనికి 28 ఏళ్ల క్రితం ఆశయ్యతో వివాహమైంది. భర్త పదేళ్ల క్రితమే చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగిస్తుంది. తన వదినను వెళ్లగొడితే.. ఉమ్మడి 12ఎకరాల భూమి తన సొంతం అవుతుందన్న ఆశతో.. ఆమెను ఆత్మహత్య దిశగా వేధించిన శ్రీనివాస్.. ఆపై శవం దొరక్కుండా ఈ డ్రామాకు తెరతీశాడు. చివరకు జైల్లో చిప్పకూడు తింటున్నాడు.