
పల్లెటూర్లలో పొద్దుపోకపోతే.. చెరువులు, కుంటలు, వాగులు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లేవాళ్లను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కూరకు సరిపోను చేపలు పట్టి.. వారు ఇంటికి వెళ్తారు. గాలంతో చేపలు పడతారు కాబట్టి నో రిస్క్. అయితే ఇలాంటి సమయాల్లో చేసే తింగరి పనులు మాత్రం ప్రాణాల మీదకి తెస్తాయి. తాజాగా ఓ వ్యక్తి పచ్చి చేప గొంతులో ఇరుక్కోని ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. బాలానగర్ మండలం మేడిగడ్డ తండాకు చెందిన 45 ఏళ్ల నీల్యానాయక్ ఇదే మండలంలోని మోతిఘణపూర్ గ్రామానికి చేరువలో ఉన్న చెరువులో శనివారం మిత్రులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. మంచిగానే చేపలు చిక్కాయి. పట్టిన వాటిలో ఒక పచ్చి చేపను తినేందుకు ప్రయత్నం చేశాడు నీల్యానాయక్. అది కాస్తా.. గొంతులోకి పోయి ఇరుక్కుంది. దీంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తోటివాళ్లు.. అతి కష్టం మీద దాన్ని తీసే లోపే ఆయన ఊపిరాడక దుర్మరణం చెందాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..