32ఏళ్ల వయసులో 28 క్రిమినల్ కేసులు.. పోలీసుల అదుపులో నిందితుడు..

మహబూబ్‎నగర్ రైల్వే పోలీసులు దోపిడీలకు పాల్పడే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిని వ్యక్తి 25 చైన్ స్నాచింగ్ ఘటనలకు, 2 దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో 32ఏళ్ల వయసున్న నిందితుడిపై పలు సెక్షన్ల కింద 28 క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది.

32ఏళ్ల వయసులో 28 క్రిమినల్ కేసులు.. పోలీసుల అదుపులో నిందితుడు..
Arrest

Updated on: Jan 28, 2024 | 6:33 PM

మహబూబ్‎నగర్ రైల్వే పోలీసులు దోపిడీలకు పాల్పడే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిని వ్యక్తి 25 చైన్ స్నాచింగ్ ఘటనలకు, 2 దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో 32ఏళ్ల వయసున్న నిందితుడిపై పలు సెక్షన్ల కింద 28 క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది.

ఇన్ని నేరాలకు పాల్పడిన నిందితుడి పేరు మైచర్ల గణేష్ గా పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‎లోని గాజువాక, విశాఖపట్నం వాసిగా గుర్తించారు. మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ వలస వచ్చి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. గణేశ్‎ను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు విశాఖ గాజువాక పోలీసులకు అప్పగించారు. కేసు నిమిత్తం అధికారులు నిందితుడిని మహబూబ్‎నగర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున రిమాండుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us