Telangana Congress: కాంగ్రెస్‌లో చేరికల జోష్.. హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్..

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్ కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా వివిధ పార్టీల నుంచి వరుసగా వలసలు పెరుగుతున్నాయి.

Telangana Congress: కాంగ్రెస్‌లో చేరికల జోష్.. హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్..
Congress

Updated on: Jul 07, 2022 | 11:27 PM

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్ కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా వివిధ పార్టీల నుంచి వరుసగా వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఎర్ర శేఖర్.. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎర్ర శేఖర్‌తో పాటు.. ఇతర నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

ఇదిలాఉంటే.. ఎర్ర శేఖర్ చేరికపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన ఎర్ర శేఖర్‌ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎర్ర శేఖర్ చేరిక కార్యక్రమానికి కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. మరోసారి ఎర్రశేఖర్ చేరికపై పార్టీ అదిష్టానానికి ఫిర్యాదు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..